Category: Political Gossips

కవిత అరెస్టు తరువాత కేసీఆర్‌ వ్యూహం మారిందా…? కాంగ్రెస్‌ టార్గెట్‌.. బీజేపీకి సపోర్ట్‌..!! కేసీఆర్‌ వ్యూహం ఇదేనా..? తాజాగా సంగారెడ్డిలో ఆయన స్పీచ్‌ ఆంతర్యం ఇదేనా..? రేవంత్‌ బీజేపీలో చేరుతాడనే ఆరోపణలో పసలేదు.. ఏడాదే ఈ ప్రభుత్వం ఉంటుందని కేసీఆర్‌ అనడం వ్యూహంలో భాగమేనా..? కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని కేసీఆర్‌ జోస్యం.. మరి మిగిలినవి బీజేపీ రావాలని కోరుకంటున్నాడా..? టీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్‌కూ తెలుసు.. ఆయన మాటల గారడీ వెనుక పరమార్థం ఏమిటీ..? కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీకి జీవం పోయడమేనా..?

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ వ్యూహం మార్చాడు. బీజేపీ పల్లవి అందుకున్నాడు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీని బతికించే వ్యూహాన్ని బాహాటంగానే ప్రకటించేశాడు. తాజాగా ఆయన సంగారెడ్డిలో జరిగిన సభలో మాట్లాడిన తీరు.. ఆయనలో మారిన మనిషి,…

ఫామ్‌హౌజ్‌లో నాయకుడు..! ఇప్పటికీ అందుబాటులో లేని కేసీఆర్‌.. !! కేటీఆర్‌ బిజీబిజీ… జైలులో కవిత..!! పార్లమెంటు ఎన్నికల వేళ ఇబ్బందికరంగా నేతల తీరు.. బీఆరెస్‌ పార్టీ పరిస్థితి నానాటికీ దిగదుడుపు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: కేసీఆర్‌ మారలే. పరాభవం మూటగట్టుకున్నా.. పార్టీ నేతలు తలోదారి పట్టి చేజారిపోతున్నా తీరు మార్చుకోలే. ఆయన ఇప్పటికీ ఫామ్‌ హౌజ్‌ రాజకీయాలే చేస్తున్నాడు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్‌లో కదనరంగంలో దూకితే…

అక్క ఒంటరి..! కేసీఆర్‌ ఇంత వరకు పలకరించని వైనం.. !! ఇది పార్టీ క్యాడర్‌కు, రాజకీయ లీడర్లకు ఎలాంటి సంకేతాలిస్తుంది..? ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై, కవిత అరెస్టుపై కేసీఆర్‌ స్పందించకపోవడం ఎత్తుగడా..? కచ్చితంగా కవిత విషయంలో కేసీఆర్‌ మౌనం ఆ పార్టీకి మరింత ప్రమాదమే…

దండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఢిల్లీ లిక్కర్‌ స్కాం, మానిలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కవితను వాళ్ల ఫ్యామిలీయే ఒంటరి చేసిందా..? కేసీఆర్‌ ఎందుకు ఇంత వరకు ఆమెను పలకరించలేదు..? ఎందుకు ఈ కేసుపై మాట్లాడలేదు..? ఏవో సోషల్‌ మీడియాలో…

అష్టదిగ్భంధనం..! బయటకు రాకుండా పాచికలు.. ఈడీ, సీబీఐ అరెస్టులతో కవితను ఇప్పట్లో బయటకు రానీయకుండా వ్యూహం.. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీసే ప్లాన్‌లో మోడీ సక్సెస్‌.. బీఆరెస్‌ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఎత్తుగడ.. కేసీఆర్‌ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పన్నాగం..

వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌: మోడీ అనుకున్నది సాధించాడు. ఒక్క దెబ్బకు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ కకావికలం. అత్యుత్సాహంతో, అహంకారంతో కవిత వేసిన రాంగ్‌ స్టెప్‌ ఆ కుటుంబానికే కాదు.. ఆ పార్టీని నమ్ముకున్న వారందరినీ ఆగం చేసింది. చెల్లాచెదురు చేసింది. అగమ్యగోచరంలో…

‘జైశ్రీరామ్‌’ చిచ్చు..! బీజేపీ, బీఆరెస్‌లో వార్‌కు తెరతీసిన కేటీఆర్‌ వ్యాఖ్యలు.. !! మాట మార్చిన కేటీఆర్‌… జైశ్రీరాం అందాం.. బీజేపీని తొక్కుదామని ట్వీట్‌.. దీనికి బండి సంజయ్‌ కౌంటర్‌…! తానీషాకు కలిగించినట్టు కలలోకి రాముడు వచ్చి కనువిప్పు క కలిగించాడా… అంటూ వ్యంగ్యం.. అంతిమంగా బీజేపీకే మైలేజీ వచ్చేలా కేటీఆర్‌ వ్యవహారం..

వాస్తవం ప్రతినిధి- హైదరాబాద్‌: అసలే ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు. మోడీ వద్ద ఉన్న ఏకైక అస్త్రం జైశ్రీరామ్‌ నినాదం. హిందుత్వ ఎజెండాతో మళ్లీ అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆశ. దీనికి తోడు ఎన్నికల వేళ ఎంతైతే అంత ఈ హిందుత్వ వేడిని…

బెయిల్‌ వస్తుందా..!?..ఉత్కంఠ ఎదురుచూపులు..!! కవిత రాక కోసం ఎదురుచూస్తున్న ఇందూరు బీఆరెస్‌.. ఆమె వస్తే పార్లమెంటు ఎన్నికల్లో దూకుడు పెరుగుతుందని క్యాడర్‌ భావన.. అర్వింద్‌కు చెక్‌పెట్టాలంటే కవిత రాక అనివార్యమని భావిస్తున్న నాయకగణం…

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: కవితకు బెయిల్‌ వస్తుందా…? వస్తుంది. తప్పక వస్తుంది. ఆమె బయటకు రాబోతుంది… ఇప్పుడు ఇవే డిస్కషన్స్‌ ఇందూరు బీఆరెస్‌లో జోరుగా సాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంటున్న సందర్బం, కవిత బెయిల్‌పై వాదనల నేపథ్యం..…

తండ్రి చాటు బిడ్డలు..! ఆయన లేక అనాథలు..!! ఇప్పుడిదీ డీఎస్‌ తనయుల పరిస్థితి.. నాడు అర్వింద్‌ గెలుపులో డీఎస్‌ది కీలకపాత్ర.. ఇప్పడు గెలవడం అంత వీజీ కాదు.. తండ్రి అనారోగ్యంతో సంజయ్‌ను పట్టించుకునే దిక్కులేదు.. ఆరోగ్యపరంగా దీనస్థితిలో డీఎస్‌..! పట్టించుకోని, పలకరింపుకు నోచుకోని పరిస్థితి..!!

దండుగుల శ్రీనివాస్‌- వాస్తవం ప్రధాన ప్రతినిధి: డీఎస్‌.. ఇందూరు బిడ్డ..! గల్లీ నుంచి ఎదిగి ఢిల్లీలో మంచి పరిచయాలు పెంచుకున్న బీసీ నేత!! పీసీసీ చీఫ్‌గా కీలక పదవి చేపట్టిన రాజకీయ ఉద్దండుడు. సీఎం పదవి తృటిలో తప్పిన నేతల్లో డీఎస్‌…

ఇద్దరూ ఇద్దరే..!! అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్‌ అడ్రస్‌లు. మిమ్మల్ని బండకేసి కొట్టినా మీరు మారలేదు.. ఈ పన్నెండు లోపాలే… అప్పుడూ, ఇప్పుడూ బీఆరెస్‌కు శాపాలు.. కేసీఆర్‌ అహంకారానికి ఏమాత్రం తీసిపోని కేటీఆర్‌.. అందుకే ఇప్పుడు ఈ దీనస్తితి..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే..! ఇదేదో పాజిటివ్‌ క్యాప్సన్ అనుకునేరు. అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్‌ అడ్రస్‌లు. సమర్థించు్కోవడంలో తీస్మార్‌ఖాన్‌లు..! లోపాలు ఎత్తిచూపితే అగ్గిబరాటాలు. జోకుడు గాండ్లకు…

మేమింతే.. మారమంతే…!! ఆ ఇద్దరిలో మార్పు లేదు.. మారరు..!! అందుకే పార్టీలో నుంచి కీలక నేతలు ఔట్‌… తాజాగా కడియం, కావ్య పార్టీ వీడటం మరింత పెద్ద షాక్‌..! చర్చనీయాంశమైన అవినీతి, అక్రమాలు, ఫోన్‌ట్యాపింగ్‌, లిక్కర్‌స్కాం… వ్యవహారాలపై కేసీఆర్‌కు కడియం లేఖాస్ర్తం.. సోషల్‌ మీడియాలో ఈ ఇద్దరిపై 12 లోపాలను ఎత్తిచూపుతున్న పార్టీ లీడర్లు, అభిమానులు..

దండుగుల శ్రీనివాస్‌ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అధికార పార్టీలోకి వలసలు కామనే. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది మాత్రం రొటీన్‌కు భిన్నం. ఎంపీ క్యాండిడేట్‌గా ప్రకటించిన తరువాత పార్టీని వదలి వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. అదీ అందులోను…

తరువాత టార్గెట్‌ అనిల్‌..! ఎవరినీ వదలని ఈడీ.. మోడీ.. ఇందూరులోనూ సోదాల కలవరం.. కవిత భర్త అనిల్‌ టార్గెట్‌గా ఈడీ సోదాలు.. పీఏలపైనా నజర్‌.. జాగృతి నేతలపైనా గురి..

వాస్తవం – ప్రత్యేక ప్రతినిధి: నిను వీడని నీడను నేనే.. అన్నట్టు కవిత వెంట పడుతున్నాడు మోడీ. కవితను అరెస్ట్‌ చేసి ఎన్నికల్లో లబ్ది పొందేందుకు రూట్‌ క్లియర్‌ చేసుకున్న మోడీ.. ఇంకా ఆమెను వదలడం లేదు. తాజాగా మాదాపూర్‌లో కవిత…

You missed