కేసీఆర్‌ సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పీకే ఇచ్చిన సర్వే రిపోర్టుతో పాటు తనకు వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకుని.. డౌటున్న సిట్టింగు స్థానాలపై కేసీఆర్‌ గురి పెట్టారు. మొన్న జరిగిన ప్లీనరీలో స్వయంగా తనే కొంత ఎమ్మెల్యేల చిట్టా తన వద్ద ఉన్నదని, వీరి తీరు మార్చుకోకపోతే టికెట్ డౌటేనని ప్రకటించారు. దీంతో సిట్టింగులందరిలో గుబులు మొదలైంది. అయితే అంతకు ముందే కేసీఆర్‌ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. స్వయంగా తను కొంత మంది టీమును ఏర్పాటు చేసుకున్నారు. ఓ ఇరవై ప్రశ్నలను తనే స్వయంగా రూపొందించారు. ఈ క్వశ్చనీర్‌ను తన టీమ్‌ చేతికిచ్చి వాటి సమాధానాలు ఆయా నియోజకవర్గాల వారీగా రాబట్టాలని ఆదేశించారు.

ఇప్పుడు వారంతా అదే పనిలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీక్రెట్ సర్వే జరుగుతోంది. మీ అభ్యర్థికి టికెట్‌ మళ్లీ ఇస్తే గెలుస్తాడా..? కచ్చితంగా అభ్యర్థిని మార్చాల్సిందేనా..? ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది..? అవినీతి ఆరోపణలున్నాయా..? సంక్షేమ పథకాల అమలులో అవినీతి ఎలా ఉంది…? ఇలాంటివే దాదాపుగా అటూ ఇటూ తిప్పి తిప్పి అడిగే ప్రశ్నలను తనదైన శైలిలో రూపొందించారు కేసీఆర్. కేసీఆర్‌ టీమ్‌ నుంచి ఫోన్‌ రావడమే…. సార్‌.. బాగున్నారా…? మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగుతాం… ఉన్నదున్నట్టుగా సమాధానమివ్వండి.. ఈ ప్రశ్నలు మేము వేస్తున్నట్టుగా కాకుండా స్వయంగా కేసీఆరే మిమ్మల్ని అడుగుతున్నారని అనుకుని సూటిగా, కరెక్టుగా సమాధానమివ్వండి.. అంటూ మొదలు పెడతారు. ఆ తర్వాత ప్రశ్నల అస్త్రాలను సంధిస్తారు. సమగ్రమైన సమాధానాలన్నీ సేకరించి కేసీఆర్‌కు ఇస్తారు. ఇదీ టార్గెట్‌. ఇలా కొనసాగుతున్నది సీక్రెట్‌ సర్వే.

అభ్యర్థికి సంబంధించిన ప్రశ్నలతో పాటు .. సంక్షేమ పథకాలపైనా ఫీడ్ బ్యాక్‌ తీసుకునేలా కొన్ని ప్రశ్నలను రూపొందించారు. మీకు సొంతింటి కోసం మూడు లక్షలు ఇవ్వబోతున్నాం.. సరిపోతాయా…? లేదు అనే సమాధానానికి ఐదు లక్షలిస్తే ఓకేనా.. సంపూర్తిగా ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా..? అని అభిప్రాయాలు సేకరిస్తారు. పంట రుణమాఫీ లక్ష వరకు అని ఇంతకు ముందు హామి ఇచ్చాం.. లక్ష రుణమాఫీ చేస్తున్నాం.. రైతుకు ఓకే కదా..! సంతోషంగానే ఉంటున్నారా..? లేదు అనే సమాధానానికి లక్షన్నర చేస్తే బాగుటుంది అని అనుకుంటున్నారా..? అని కూడా లింకు క్వశ్చన్ వేసి వారి అభిప్రాయాన్ని సేకరిస్తారు.

You missed