అవును. న‌మ‌స్తే తెలంగాణ పాత టీమ్ అంతా ఖాళీ అవుతోంది. ఎడిట‌ర్ కృతి ఆగ‌డాలు భ‌రించ‌లేక ఒక్కొక్క‌రు అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. బ‌య‌ట వేరే అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల‌నో, లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల‌నో గానీ మొత్తానికైతే న‌మ‌స్తే తెలంగాణ పాత ఉద్యోగులు న‌మ‌స్తే చెప్పుతున్నారు. ఇదంతా ఎడిట‌ర్ కృతి ఆడిన వికృత నాట‌కంలో భాగ‌మే. త‌న‌వాళ్ల‌కు న‌మ‌స్తే తెలంగాణ‌లో ఉద్యోగాలు క‌ల్పించ‌డానికి ప‌రోక్షంగా ఇప్పుడున్న పాత ఉద్యోగుల‌పై కృతి ఇబ్బంది పెట్టి ఏదో ర‌కంగా బ‌య‌ట‌కు పంపించ‌డానికి ఇలాంటి వింత చేష్ట‌లు మొద‌టి నుంచే చేస్తున్నాడు. అదీకాకుండా స‌ద‌రు ఎడిట‌ర్‌కు తెలంగాణ అంటే గిట్ట‌దు. ఏనాడూ తెలంగాణ కోసం ఒక సింగిల్ కాల‌మైనా రాసిన దాఖ‌లాలు లేవు.

ఇప్పుడు త‌న పేర వ‌చ్చే ఆర్టిక‌ల్స్ కూడా ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ రాసిస్తే త‌న పేరు పెట్టుకుంటాడు. కృతి తానే కాదు ఇంకెవ‌రైనా తెలంగాణ ఆత్మ‌తో రాస్తే స‌హించే వ్య‌క్తి కాదు. ఎప్పుడూ ఈ తెలంగాణ భాష ఏంటి.. ఇలా రాస్తే ఎవ‌రు చ‌దువుతారు? చాలా పాష్‌గా ఉండాలి.. పాష్‌గా ఉంటేనే చ‌దువుతారు.. ఆద‌రిస్తారు.. అంతేత‌ప్ప తెలంగాణ జ‌పంచేస్తే ఎలా అని ఎన్నోసార్లు ముఖ్య స‌మావేశాల‌లో చెప్తుండేవాడ‌ట తెలంగాణ మీద ద్వేష‌మున్న ఈ కృతి. తెలంగాణ సోయితో మ‌నుసు పెట్టి ప‌నిచేసే జ‌ర్న‌లిస్టులు ఉండ‌టం ఆటోమేటిగ్గా న‌చ్చ‌దు కాబ‌ట్టి త‌న పైశాచికానందానికి ప‌దును పెడుతున్నాడు.

మొన్న‌టికి మొన్న స్టేట్ బ్యూరో నుంచి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కోటిరెడ్డి టాటా చెప్ప‌గా, తాజాగా సెంట్ర‌ల్ డెస్క్ ఇన్‌చార్జి జ‌గ‌న్‌, సెకండ్ ఇన్‌చార్జి సంతోష్ త‌మ ఉద్యోగాల‌కు రాజీనామా చేశారు. ఎడిట‌ర్ టార్చ‌ర్ భ‌రించ‌లేకే వీళ్లు న‌మ‌స్తే తెలంగాణ‌ను విడిచి పెట్టార‌ని తెలుస్తోంది. సంస్థ ఆవిర్భావం నుంచి చీఫ్ ఆర్టిస్ట్‌గా కొన‌సాగుతున్న భాను కూడా ఇవాళో రేపో త‌న రాజీనామాను స‌మ‌ర్పించ‌నున్నాడు. ఫీచ‌ర్స్‌లో ప‌నిచేస్తున్న దాయి శ్రీశైలం కూడా ఎడిట‌ర్ పైత్యానికి బ‌లై రాజీనామా చేశాడు.  ప్ర‌తీ డెస్కులో త‌న పంజా విసురుతూ రోజుకో ఉద్యోగిని ఆగంజేస్తున్నాడు కృతి. ఇదంతా ఎవ‌రూ ప‌సిగ‌ట్ట‌కుండా ఉండేందుకు ప‌నికిమాలిన కార‌ణాలు చెప్పి బుద్ధిగా ప‌నిచేస్తున్న వాళ్ల మెడ మీద క‌త్తి పెడుతున్నాడు.

ఇలా ఎందుకు చేస్తున్నాడో కృతికి.. ఆయ‌న భ‌జ‌న బృందానికి మాత్ర‌మే తెలుసు. త‌న వాళ్ల‌ను.. మ‌రీ ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌ర్న‌లిస్టుల‌తో న‌మ‌స్తే తెలంగాణ‌ను నింపేద్దాం అనుకుంటున్నాడు. ఇప్ప‌టికే త‌న ప్ర‌య‌త్నాల్లో కొంత విజ‌యం సాధించాడు కూడా. ఫీచ‌ర్స్ డెస్క్ ఇన్‌చార్జి ఆంధ్రా ప్రాంతానికి చెందిన త‌న సామాజిక వ‌ర్గం వ్య‌క్తే. ఒక్క ఫీచ‌ర్స్ డెస్క్‌లోనే ఆరుగురు జ‌ర్న‌లిస్ట్‌లు ఉంటే వారిలో త‌న స‌మాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు న‌లుగురు ఉంటారు. ఎడ్యుకేష‌న్ డెస్క్‌లో ఆరుగురు ఉద్యోగులు ఉంటే వారిలో ఇన్‌చార్జితో స‌హా న‌లుగురు ఎడిట‌ర్ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వాళ్లే. వాళ్లంతా ఏదో ర‌కంగా ఎడిట‌ర్‌కు బంధువులేన‌టా. ఇలా త‌న వాళ్ల‌కు ఉద్యోగాలు.. ఎక్కువ జీతాలు ఇవ్వ‌డం కోసం పాపం ఇన్నాళ్లూ సంస్థ‌ను న‌మ్ముకొని ఉన్న‌వాళ్ల పొట్ట‌గొడుతున్నాడు ఎడిట‌ర్‌. రోజుకొక‌రు ఇలా వెళ్తే సంస్థ ప‌రిస్థితి ఏంటి? అని ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అడిగితే.. ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌డేస్తే అలాంటివాళ్లు క్యూ క‌డ‌తారు అన్నాడ‌ట‌.

అంటే మ‌న‌సు పెట్టి ప‌నిచేసిన‌వాళ్ల‌ను పంపించి.. ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు ఆశ‌ప‌డి వ‌చ్చిన‌వాళ్ల‌ను అంద‌ల‌మెక్కించ‌డ‌మేనా ఎడిట‌ర్ నీతి అని ఉద్యోగులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. చీఫ్ ఆర్టిస్ట్ భాను వెళ్లిపోతాడ‌ని తెలిసి ఆయ‌న స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు ఒక డిజైన‌ర్‌కు అక్ష‌రాలా ల‌క్షా యాభైవేలు ఆఫ‌ర్ చేశాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌హుశా అత‌డు కూడా త‌న‌ బంధువో లేక కావాల్సిన వ్య‌క్తో అయి ఉంటాడు. ఇక్క‌డ ల‌క్ష రూపాయ‌ల ఆఫ‌ర్ కోసం వ‌చ్చిన‌వాడు వేరే ద‌గ్గ‌ర ల‌క్షా యాభైవేలు వ‌స్తే వెళ్ల‌క ఉంటాడా? కానీ.. ఇంత‌కాలం ప‌నిచేసిన పాత వాళ్లు అవ‌కాశాల కోసం కాకుండా ఆత్మ‌గౌర‌వంతో న‌మ‌స్తే తెలంగాణ‌లో ప‌నిచేశారు. ఎన్ని ఆఫ‌ర్లు వ‌చ్చినా అక్క‌డే ఉన్నారు. చూద్దాం కృతి.. తెలంగాణ‌ను ఉద్ద‌రించ‌డానికి ఇలా చేస్తున్నాడో, లేక న‌ట్టేటా ముంచ‌డానికో?!

నమస్తే తెలంగాణ ఎడిటర్‌ కృతి బాధితుల సంఘం

You missed