“వాస్త‌వం”… ఎక్స్‌క్లూజివ్‌..
www.vastavam.in

……………………………………………………………………………….

ఎన్నాళ్ల నుంచో ఆస‌రా పింఛ‌న్ కోసం ఎదురు చూస్త‌న్న బీడీ కార్మికుల‌కు ఇది శుభ‌వార్త‌. ప్ర‌భుత్వం బీడీ కార్మికుల‌కు జీవ‌న భృతి కింద ఆస‌రా పింఛ‌న్‌ను అందిస్తున్న‌ది. దీనికి మొన్న‌టి వ‌ర‌కు ఓ క‌టాఫ్ డేట్‌ను పెట్టింది. 2014 ఫిబ్ర‌వ‌రి 28 లోపు పీఎఫ్ నెంబ‌ర్ క‌లిగి ఉన్న‌వారు మాత్ర‌మే బీడీ పింఛ‌న్‌కు అర్హులు. మొన్న‌టి వ‌ర‌కు వారే ఆస‌రా పింఛ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. పంద్రాగ‌స్టు రోజున రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ 10 ల‌క్ష‌ల మంది కొత్త వారికి ఆస‌రా పింఛ‌న్ మంజూరు చేసిన వాటిల్లో బీడీ కార్మికులు కూడా ఉన్నారు.

అయితే ఆ క‌టాఫ్ డేట్ మూలంగా చాలా మంది కొత్త వారికి బీడీ కార్మికుల జీవ‌న భృతి చేర‌డం లేదు. వారు అర్హుల కింద‌కు రావ‌డం లేదు. చాలా రోజులుగా వివిధ పార్టీలు, మ‌హిళ‌లు, క‌మ్యూనిస్టు పార్టీలు దీనిపై ఆందోళ‌న‌లు చేస్తూ వ‌స్తున్నాయి. పీఎఫ్ నెంబ‌ర్ ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికీ పింఛ‌న్ అందివ్వాల‌ని వారు డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తీ సోమ‌వారం జ‌రిగే ప్ర‌జావాణిలో దీనిపైనే అత్య‌ధిక ఫిర్యాదులు వ‌చ్చేవి. క‌లెక్ట‌ర్లు కూడా ఈ విష‌యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకువ‌స్తున్నారు.

ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం దీనిపై సానుకూలంగా స్పందించింది. ఈ క‌టాఫ్ డేట్‌ను ఎత్తివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు విశ్వ‌సనీయంగా తెలిసింది. రెండ్రోజుల్లో దీనిపై ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిసింది. అత్యిధికంగా క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాల్లోనే బీడీ కార్మికులున్నారు. పీఎఫ్ నెంబ‌ర్ క‌లిగి ఉన్న వీరంద‌రూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆస‌రా పింఛ‌న్‌కు ఇక‌పై వీరంతా అర్హులే.

Dandugula SRINIVAS

You missed