న‌మ‌స్తే తెలంగాణ‌కు ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడ్ బై చెప్పాడు. వివిధ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌లో ప‌నిచేసి తెలంగాణ మీద ప్రేమ‌తో న‌మ‌స్తేలో చేరిన ఆ జ‌ర్న‌లిస్టుకు ప‌త్రిక అవ‌లంభిస్తున్న విధానాలు, రోజు రోజుకు దిగ‌జారుతున్న ప‌రిస్థితి చూసి తీవ్ర అసంతృప్తికి లోన‌య్యాడు. స్వ‌చ్చంధంగా త‌న రాజీనామాను ఎడిట‌ర్‌కు అందించి గుడ్ బై చెప్పాడు. త‌న‌కు జీతం స‌మ‌స్య లేద‌ని, ఇందులో జీవితం లేద‌ని ఆయ‌న త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. జేబు సాటిస్‌ఫ్యాక్ష‌న్ ఉంది కానీ.. జాబ్ సాటిస్ఫ్యాక్ష‌న్ లేద‌ని ఆయ‌న ముక్కుసూటిగా త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించి సంస్థ నుంచి నిష్క్ర‌మించిన‌ట్లు తెలిసింది. ఇదిప్పుడు మీడియా స‌ర్కిళ్ల‌లో హాట్ టాపిక్‌గా మారింది. న‌మ‌స్తే తెలంగాణ లో చేరిన నాటి నుంచి ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప్ర‌త్యేక ప్ర‌తినిధిగా అనేక విభిన్న క‌థ‌నాలు, ఆస‌క్తిక‌ర స్టోరీలు ఇచ్చాడు. కానీ రాను రాను ప‌త్రిక‌ల్లో వ్య‌క్తుల ప్ర‌మేయం ఎక్కువై పోయింది. వ్య‌వ‌స్థ గురించి కాకుండా వ్య‌క్తుల గురించి ఆలోచించుకునే దోర‌ణి పెరిగిపోయింది. దీని వ‌ల్ల స‌ర్క్యూలేష‌న్ ఘోరంగా ప‌డిపోయింది. అయినా ప‌ట్టింపు లేదు. ఎడిట‌ర్ ద్వంద్వం వైఖ‌రి అక్క‌డ ప‌నిచేసే ఉద్యోగుల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. ఓ ఇంటి పెద్ద‌.. తండ్రిలాంటి వాడు త‌న పిల్ల‌ల‌తో రాజ‌కీయాలు చేస్తే ఎలా ఉంటుంది? అదే చేస్తున్నాడు కృష్ణ‌మూర్తి. కొత్త వ‌చ్చిన అత‌ను వ్య‌వ‌స్థ‌ను బాగుప‌ర్చేది పోయి .. మొత్తం పంట‌ను త‌గుల‌బెట్టిన చందంగా చేస్తున్న తీరు ప్ర‌తిక మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌క‌రంగా మారింది. ఇదెక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిందంటే.. అస‌లు ఈ ప‌త్రిక వ‌ల్ల మాకేమైన్నా ఉప‌యోగ‌మా? అని టీఆరెస్ పెద్ద‌లే ఆలోచించుకునే స్థితికి దిగ‌జార్చారు. ముగ్గురి ఆధిప‌త్య దోర‌ణిలో మ‌ధ్య‌లో ఉద్యోగులు న‌లిగిపోతున్నారు. ఎడ్ల కొట్లాట‌లో దూడ‌లు న‌లిగిన‌ట్లు.

ప్ర‌జ‌ల‌కు దూర‌మై, పాఠ‌కులు లేక ఉనికి కోల్పోయే ప‌రిస్థితి ప్ర‌తిక‌కు ఎందుకొచ్చింది? కార‌ణం ఎవ‌రు? ఎడిట‌ర్ కుల‌పిచ్చి వ‌ల్ల ప‌త్రికకు న‌ష్టం జ‌రుగుతున్న‌ది వాస్త‌వం కాదా? ఉన్న వాళ్ల‌ను పీకేసీ ఆయ‌న ఎవ‌రిని పెడుతున్నాడు. కోస్తా బ్రాహ్మ‌ణుల‌కు ఎందుకు అవ‌కాశం ఇస్తున్నాడు? తెలంగాణ జ‌ర్న‌లిస్టులు లేరా? ఇక్క‌డి వాళ్లు ప‌నికిరారా? ఇవ‌న్నీ ప్ర‌శ్న‌లు ఎడిట‌ర్‌కు శ‌రాఘాతంలా త‌గులుతున్నాయి. కానీ ఆయ‌న మాత్రం త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ పోతున్నాడు. డోంట్ కేర్‌.

ఆఖ‌రికి ఎమ్మెల్యేల‌కు, మంత్రుల‌కు, టీఆరెస్ నాయ‌కుల‌కు కూడా ఇందులో స్పేస్ లేకుండా పోయింది. దేని కోసం ప‌త్రిక‌ను స్థాపించారో ఆ ల‌క్ష్యాన్ని ఎప్పుడో విస్మ‌రించారు. వ్యక్తుల ప్ర‌యోజ‌నాల కోసం చేసే ఈ రాజ‌కీయాలు అంతిమంగా ప్ర‌భుత్వానికి,పార్టీకి చెడ్డ పేరుతెస్తున్నాయి. ఇది కేసీఆరో, కేటీఆరో చేపిస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. ప‌త్రిక‌ను న‌మ్ముకున్న వాళ్ల‌ను న‌ట్టేట ముంచారు. ప‌త్రిక మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మార్చేస్తున్నారు.

అధికార పార్టీ ప‌త్రిక అంటే .. ముందే స‌మాచారం ఉండాలి. ఓ జీవో గురించి ముంద‌స్తుగా రాసుకునే స‌మాచార వ్య‌వ‌స్థ ఉండాలి. కానీ అన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన త‌ర్వాత ఇందులో వ‌స్తాయి. స్కోరింగ్ ఉండ‌దు. బోరింగ్ ఉంటుంది. ప్ర‌జావ‌స‌రాల‌కు స్థానం ఉండ‌దు. న‌మ‌స్తే తెలంగాణ మారిన తీరు చూసి పాఠ‌కులెవ‌రు జీర్ణం చేసుకోలేక దూరమ‌వుతూ వ‌స్తున్నారు. ఇప్పుడు న‌మ‌స్తే తెలంగాణ ప్రేక్ష‌కులు లేని క్రికెట్ మ్యాచ్ లా మారింది. పౌర స‌మాజానికి దూర‌మైపోయిన ఈ ప‌త్రిక‌లో ప‌నిచేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ఆ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

You missed