శ్రీ‌రాం సాగ‌ర్ ప్రాజెక్టు పై ఇక కేంద్ర పెత్త‌నం సాగ‌నుంది. దీని నీటి విడుద‌ల అంతా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్లింది. ఉత్త‌ర తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయినిగా ఉన్న ఈ ప్రాజెక్టు కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో దీనిపై ఆధార‌ప‌డి సాగుచేసుకుంటున్న రైతుల‌కు ఇది ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మార‌నుంది. ఇక పెత్త‌నమంతా కేంద్రం చేతిలో ఉంటే రాష్ట్ర అవ‌స‌రాలు దానికి ప‌ట్ట‌దు. ఇక్క‌డి సంబంధాల‌పై నీటి విడుద‌ల‌పై అనుమ‌తులు ఆధార‌ప‌డి ఉంటాయి. మ‌ధ్య‌లో రైతుల‌కు గోస త‌ప్పేలా లేదు. వ‌ర్షాలు ప‌డితే ఓకే. లేదంటే మాత్రం గ‌డ్డు ప‌రిస్థితులు ఏదుర్కోక త‌ప్ప‌దు. మ‌రోవైపు ఎస్సారెస్సీ పున‌రుజ్జీవ ప‌థ‌కం ఫ‌లాలు ద‌క్కాల‌న్నా.. అది కూడా కేంద్ర బోర్డు ప‌రిధిలోకి వెళ్ల‌డంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని అన్న‌ట్టుగా నీటి విడుద‌ల త‌మ చేతిలో లేకుండా పోతున్న‌ది. మ‌రోవైపు దీనిపై ఆధార ప‌డి ఉన్న లిఫ్టుల‌కు నీళ్లు ఇవ్వాల‌న్నా అనుమ‌తులే కావాలి. త‌క్ష‌ణ అవ‌స‌రాలు తీర్చేందుకు త‌క్ష‌ణ నిర్ణ‌యాలు ఇక సాధ్యం కావు. అన్నీ కేంద్ర‌మే చూడాలి. వారు ఓకే చెప్పాలి. అప్ప‌టి వ‌ర‌కు రైతుల‌కు ప‌డిగాపులు త‌ప్ప‌వు. కొత్త లిఫ్టులు ఏర్పాటు ఇక క‌ల్లే. అవి సాధ్యం కావు. కావాలంటే అనుమ‌తులు కావాలి. వారివ్వ‌రు. కొత్త‌వి రావు. మ‌రోవైపు ఇది రాజ‌కీయ రంగు పులుముకుంటున్న‌ది. బాల్కొండ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ నాయ‌కులు నిజామాబాద్ ఎంపీగా ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నిన్ను గెలిపించినందుకు జిల్లా రైతుల‌కు నువ్విచ్చిన బ‌హుమ‌తి ఇది అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనిపై భ‌విష్య‌త్తు ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌కు లోక‌ల్ టీఆరెస్ క్యాడ‌ర్ సిద్ధ‌మ‌వుతున్న‌ది.

లిఫ్టుల ఉనికి ప్ర‌శ్నార్థ‌క‌మే…

ఇక పై గుత్ప లిప్టుకు నీళ్లు వ‌ద‌లాన్న అలీసాగ‌ర్‌, హ‌న్మంత్‌రెడ్డి, త‌ల్వేద‌, వ‌న్నెల్‌, మ‌గ్గిడి, సిద్ధాపూర్‌, మంథ‌ని, యంచ‌, నాళేశ్వ‌ర్ వంటి సుమారు 20కి పైగా లిప్టుల ద్వారా జిల్లా రైతాంగానికి సాగు చేసుకునేందుకు నీళ్లు వ‌ద‌లాలి అన్న కొత్త‌గా ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు క‌ట్టాల‌న్న కేంద్ర బోర్డు అనుమ‌తి తీసుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎత్తిపోత‌ల ద్వారా నీళ్లు విడుద‌ల చేయాల‌న్న, కాలువ‌ల ద్వారా విడుద‌ల చేయాల‌న్న అధికారుల‌కు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు చెబితే విడుద‌ల చేసే వారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు.

One thought on “రైతుల న‌డ్డి విరిచే నిర్ణ‌యం….ఎస్సారెస్పీ పై కేంద్ర పెత్త‌నం…”

Comments are closed.

You missed