ఒక‌ప్పుడు సొంత మీడియా లేక‌పోతే ఆ రాజ‌కీయ పార్టీకి మ‌నుగ‌డ లేదు. కానీ ఇప్పుడు కోట్లు కుమ్మ‌రించి సొంత మీడియాను ర‌న్ చేస్తున్నా.. దాంతో ఒరిగేదేమీ లేద‌ని తేలిపోయింది ఆయా పార్టీల‌కు.

ముసుగేసుకొని నిన్న‌టి మొన్న‌టి వ‌ర‌కు టీడీపీకి వ‌త్తాసు ప‌లికిన ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల నిజ‌స్వ‌రూపాలు కూడా బ‌య‌ట‌ప‌డ‌టంతో ఇప్పుడు ఏ ప‌త్రిక‌లో ఎలాంటి వార్త‌లు వ‌స్తాయో పాఠ‌కుడి ముందుగానే అంచ‌నా వేసే చైత‌న్యానికి వ‌చ్చాడు. దీంతో ఇక తాము చెప్పిన‌ట్లు పార్టీలు న‌డుచుకోవాల‌ని, తమ చేతుల్లోనే పార్టీల ప్ర‌భుత్వాల భ‌విష్య‌త్తు ఉంద‌ని భ‌య‌ప‌ట్టి భ్ర‌మ‌ల్లో ముంచే ప‌రిస్థితులు పోయాయి. ఇపుడంతా సోష‌ల్ మీడియా యుగం. దీన్ని అత్యంత ముందుగా అందిపుచ్చుకున్న‌ది బీజేపీయే అని చెప్పాలి. హిందుత్వ భావ‌జాలాన్ని వ్యాప్తి చేసే మెజారీటీ వ‌ర్గం బీజేపీని బ‌లోపేతం చేసే ప‌నిని స్వ‌చ్చంధంగా తీసుకున్న‌ది. పుట్ట‌గొడుగుల్లా వాట్స‌ప్ గ్రూపులు. సోష‌ల్ మీడియాలో ఊరు పేరులోని ఎన్నో ఫేక్ అకౌంట్లు. వాటి అంతిమ ల‌క్ష్యం మ‌తం వేదిక‌గా ఇత‌ర పార్టీల‌ను నీరుగార్చాలె. బీజేపీని బ‌లోపేతం చేయాలె. హిందువుల‌ను రెచ్చ‌గొట్టి బీజేపీ వైపున‌కు మ‌ళ్లించాలి. అవ‌స‌ర‌మైనా లేకున్నా ప‌చ్చి అబ‌ద్దాలు ఆడేందుకు వెన‌కాడొద్దు. మార్పింగుల‌తో మ‌తిపోగొట్టాలె. నిజ‌మేనా అని న‌మ్మించేలా పోస్టింగులు పెట్టాలె. అడ్డుకునేవారు లేరు. నిలువ‌రించే వీలే లేదు. క‌ల్లు తాగిన కోతిలా విరుచుకుప‌డ్డారు. అనుకున్న‌ది సాధిస్తున్నారు.

దీన్నంతా మొద‌టినుంచి టీఆరెస్ గ‌మ‌నిస్తూనే ఉంది. కానీ తీసిపారేసింది. పిల్లి బిత్తిరి నాయాళ్లు మీతో ఏమ‌వుతుందిరా అన్న‌ట్లుగా చుల‌క‌న చూశారు. అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా కొంద‌రు ఉన్నా.. స్వ‌చ్చంధంగా పోరాడుతున్నా.. వీరికి ఎలాంటి స‌పోర్టు లేకుండా పోయింది. ఇక గుర్తింపు మాట దేవుడెరుగు. మీ ఇష్టం మీ ఖ‌ర్మ‌రా… పార్టీని కాపాడుకోవ‌డం మీ విధి.. క‌ర్త‌వ్యం.. లేక‌పోతే మీరే చ‌స్తారు.. మాకేందీ..? అన్న‌ట్లుగానే టీఆరెస్ వైఖ‌రి కొన‌సాగింది. మెల్ల‌మెల్ల‌గా న‌ష్టం తాలూకు రుచి టీఆరెస్‌కు తెలిసివ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా లేకుండా క‌ష్ట‌మేరోయ్ అని గ్రహించింది. అయినా ఎక్క‌డో ఇంకా ఏదో అహం, అహంకారం, ధీమా… ప్రిస్టేజీ అడ్డొచ్చిన‌ట్టున్నాయి. మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చింది. సొంత మీడియా న‌మ‌స్తే తెలంగాణ మా చేతిలో ఉంది క‌దా అనే వెర్రి ధీమా కూడాదీనికి తోడై కూర్చుంది. కానీ అది క్ర‌మ‌క్ర‌మంగా చేతులు మారి మారి ఎలా చేవచ‌చ్చి మ‌ట్టి క‌రిచి పోతున్న‌దో తెలుసుకోలేక‌పోయారు. చేతులు కాలాయి. మూతులు కూడా కాలాయి. ఇక టోట‌ల్ బాడీ కూడా త‌గ‌ల‌బ‌డిపోతుందేమోన‌ని భ‌యం నిండా వ‌ణికించింది. సొంత మీడియాను నమ్ముకుంటే బ‌తుకు బ‌స్టాండేన‌ని అర్థం చేసుకోవ‌డానికి టీఆరెస్‌కు చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. ఇపుడు త‌త్వం బోధ‌ప‌డ్డ‌ది. అంటే బ‌త్తాయిలు అని తిట్టిన నోళ్లే వాళ్ల‌లా ప‌చ్చి అబ‌ద్దాలైన ఆడుతాం అంటున్నారు. ఢీ అంటేఢీ అంటున్నారు. అభివ్రుద్ది ప్ర‌చారం క‌న్నా అబ‌ద్దాల ప్ర‌చారాన్ని తిప్పి కొట్ట‌క‌పోతే అంతే సంగుత‌ల‌ని తెలిసిపోయింది. అదీ సోష‌ల్ మీడియా వేదిక‌గానే. దీంతో ఇప్ప‌టికే న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగారు. క్రిశాంక్ అని ఒక‌రిని పెట్టుకున్నారు. శిక్ష‌ణ‌లు ఇప్పించారు. కానీ అంత ఎఫెక్ట్ ఏమీ క‌నిపించ‌లేదు. దీన్ని వేదిక‌గా చేసుకొని క్రిశాంక్ రాజ‌కీయంగా లాభ‌ప‌డాల‌ని చూశాడే త‌ప్ప‌.. పార్టీని బ‌లపేతం చేసేందుకు, బీజేపీ, హిందుత్వ శ్రేణుల ఆరోప‌ణ‌ల‌ను తిప్పికొట్ట‌లేక‌పోయాడు. చ‌తికిల‌ప‌డ్డాడు. ఇప్ప‌టికీ టీఆరెస్ సోష‌ల్ మీడియా మ‌రీ వీక‌నే చెప్పాలి. ఇప్ప‌టికి తేరుకొని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా సోష‌ల్ మీడియా ఇన్చార్జిల‌ను నియ‌మిస్తార‌ట‌. ఇక సొంత మీడియా అవ‌స‌రం పెద్ద‌గా లేద‌ని అందులో ప‌నిచేస్తున్న వారిని మ‌ళ్లీ కొంత కొంత మందిని రోడ్డు పాలు చేయ‌రుక‌దా. చేసినా ఆశ్చ‌ర్యమేమీ లేదు.

You missed